HomeUncategorizedAhmedabad Plane Crash | విమాన ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

Ahmedabad Plane Crash | విమాన ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న విమానం టేకాఫ్​ అయిన కొద్ది క్షణాల్లోనే బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel)​ భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం 265 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఆ సంఖ్య 274కు చేరింది.

Ahmedabad Plane Crash | 33 మంది మెడికోల మృతి

విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది 241 మంది ప్రమాదంలో మరణించారు. ఫ్లైట్​లో నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే విమానం హాస్టల్​ భవనం(Hostel building)పై కూలడంతో అందులోని వైద్య విద్యార్థులు(Medical students) చనిపోయారు. మొదట 24 మంది చనిపోగా.. తాజాగా ఆ సంఖ్య 33 కు చేరింది. శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉన్నాయేమోనని అధికారులు గాలిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Ahmedabad Plane Crash | ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న డీజీసీఏ, ఎన్​ఏఐ

విమాన ప్రమాదం చోటు చేసుకున్న స్థలాన్ని డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ (​DGCA) అధికారులు పరిశీలించనున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు విమాన శకలాలు తొలగించొద్దని డీజీసీఏ ఆదేశించింది. దీంతో ఘటనా స్థలంలో శకలల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే ఎన్​ఐఏ అధికారులు(NIA officers) ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఎన్‌ఐఏ అధికారుల పరిశీలన మరో మరో మృతదేహం బయటపడింది.కుట్రకోణం ఉందనే అనుమానంతో ఎన్‌ఐఏ విచారణ చేపడుతోంది.

Must Read
Related News