ePaper
More
    HomeతెలంగాణHyderabad | కల్తీ కల్లు ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు.. ఏడు దుకాణాల లైసెన్స్​లు​ రద్దు

    Hyderabad | కల్తీ కల్లు ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు.. ఏడు దుకాణాల లైసెన్స్​లు​ రద్దు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​(Hyderabad)లోని కూకట్​పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఘటనలో తొలుత ముగ్గురు మృతి చెందగా.. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరికొంత మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు.

    కూకట్​పల్లి పరిధిలోని హైదర్​నగర్(Kukatpally Hydernagar)​లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 51కి చేరింది. గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో 15 మంది, నిమ్స్‌(NIMS)లో 34 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్​లో వైద్యులు డయాలసిస్​ చేస్తున్నారు.

    Hyderabad | మోతాదుకు మించి కలపడంతోనే..

    కల్తీ కల్లు ఘటనలో ఎక్సైజ్​ శాఖ అధికారులు(Excise Department Officers) చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు కల్లు కంపౌండ్​లలో తనిఖీలు నిర్వహించారు. కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్​లకు పంపించారు. నిషేధిత అల్ప్రాజోలం కలపడంతోనే ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఏడు కల్లు కాంపౌండ్ల లైసెన్స్‌ రద్దు చేశారు.

    కల్తీ కల్లు(Kathi Kallu) తాగిన కొద్ది సేపటికి ప్రజలు తలనొప్పి, వాంతులు, అపస్మారక స్థితికి వెళ్తున్నారు. ఇలాంటి వారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాధితుల్లో రోజువారి కూలీలే అధికంగా ఉన్నారు. కల్తీ ఘటనలో ఎక్సైజ్​ అధికారులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్​ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...