అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy GGH | కామారెడ్డి జీజీహెచ్‌లో శనివారం ఓ వృద్ధుడు మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే (doctors negligence) అతడు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం..
కామారెడ్డి పట్టణానికి (Kamareddy Town) చెందిన ఎంబరి తిరుపతి(55)ని కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం 1 గంటలకు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. బీపీ, షుగర్ ఎక్కువ కావడంతో అప్పటికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారిందని దీంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోవానలి డ్యూటీ డాక్టర్‌ను (Duty Doctor) రోగి కుటుంబసభ్యులు కోరారు. అయితే ఐసీయూలో బెడ్స్ ఖాళీగా లేవని ఆయనను అడ్మిట్ చేసుకోలేదు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఐసీయూలో బెడ్లు ఖాళీగా కనిపించగా వైద్యుడిని నిలదీశారు.
కాని పేషంట్‌కు కాన్సంట్రేటర్ ఆక్సిజన్ (concentrator oxygen) కావాల్సి ఉందని, ఐదు నెలలుగా ఆస్పత్రిలో కాన్సంట్రేటర్ ఆక్సిజన్ అందుబాటులో లేదని సాయంత్రం 5గంటలకు డ్యూటీ డాక్టర్ సమాధానమిచ్చారు. కాసేపటికే తిరుపతి మృతి చెందాడు. దాంతో బాధిత కుటుంబ సభ్యులు వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. బెడ్స్ ఖాళీగా ఉన్నా లేవని ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు.
Kamareddy GGH | ఒక్క పేషంట్నే చూసుకుంటూ ఉంటామా..?
ఐదు గంటలుగా అడ్మిట్ చేసుకోకపోవడంతో పేషంట్ (patient) మృతి చెందిన విషయమై డ్యూటీ డాక్టర్‌ను వివరణ కోరగా.. ఆస్పత్రిలో ఒక్క పేషంట్తోనే ఉంటామా.. మిగితా పేషంట్లను ఎవరు చూస్తారు.. అంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కాన్సంట్రేటర్ ఆక్సిజనల్ లేదని కూడా సంబంధిత ఇన్‌ఛార్జి వైద్యుడు చెప్పాడని డ్యూటీ డాక్టర్ చెప్పగా.. ఇన్‌ఛార్జి మాత్రం డ్యూటీ డాక్టర్‌కే అంతా తెలుసని చెప్పడం కొసమెరుపు. ఇలా ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోజురోజుకూ పెరిగిపోతోందని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.