HomeUncategorizedPahalgam terrorist attack | పాక్‌కు చావుదెబ్బ‌.. దాయాదిపై జ‌ల‌ఖ‌డ్గం

Pahalgam terrorist attack | పాక్‌కు చావుదెబ్బ‌.. దాయాదిపై జ‌ల‌ఖ‌డ్గం

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: ఉగ్ర‌మూక‌ల‌ను ఎగ‌దోస్తున్న‌ పాకిస్తాన్‌పై భార‌త్ union government of India క‌ఠిన చ‌ర్య‌ల‌కు దిగింది. ఒక్క బుల్లెట్ కూడా పేల్చ‌కుండానే దాయాదిని ఊహించ‌ని రీతిలో శిక్షించింది. దౌత్య‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌ల‌కు దిగ‌డం ద్వారా పాక్ ఆర్థిక‌, వాణిజ్య రంగాల‌ను దెబ్బ కొట్టింది. సింధు జ‌లాల Sindhu river ఒప్పందాన్ని ర‌ద్దు చేస్తూ నీళ్లు ఆపేయాల‌ని నిర్ణ‌యించింది. త‌ద్వారా వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డిన పాక్‌ను ఎడారిగా మార్చే ఎత్తుగ‌డ వేసింది.

అదే స‌మ‌యంలో వాఘా-అటారి స‌రిహ‌ద్దు Wagah-Attari border మూసివేయ‌డం వ‌ల్ల పాక్‌కు దిగుమ‌త‌య్యే స‌ర‌ఫ‌రాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది. పొరుగు దేశంతో ఎక్క‌డా నేరుగా త‌ల‌ప‌డ‌కుండానే పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌లన నిర్ణ‌యాలు తీసుకుంది. జ‌మ్మూకశ్మీర్‌ Jammu and Kashmir లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో బుధ‌వారం ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ Cabinet Committee on Security తీసుక‌న్న‌ నిర్ణ‌యాలు పాక్‌ను చావుదెబ్బ తీయ‌నున్నాయి.

Pahalgam terrorist attack  : ఎడారిగా మార‌నున్న పాక్‌..

కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల్లో ప్ర‌ధాన‌మైన‌ది పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయ‌డం. సింధు, దాని ఉపనదుల నీటిని పంచుకోవడానికి 1960లో రెండు దేశాల మ‌ధ్య ఈ జ‌ల ఒప్పందం కుదిరింది.

సింధు జ‌లాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ Ravi, Beas , Sutlej జలాలను భారతదేశానికి, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ Indus, Jhelum , Chenab జలాలు పాకిస్తాన్‌కు ద‌క్కాయి. చైనాలో పుట్టి భార‌త్ మీదుగా పాకిస్తాన్‌లోకి ప్ర‌వ‌హించే సింధు నది పొరుగు దేశానికి జీవనాడి. ముఖ్యంగా పంజాబ్, సింధ్ బెల్ట్‌కు ప్రాణాధారం. పొరుగు దేశానికి ఆయువు ప‌ట్టుగా నిలిచిన న‌దీ జ‌లాల‌ను నిలిపివేయాల‌ని భార‌త్ తాజాగా నిర్ణ‌యించింది. వ్య‌వ‌సాయ‌మే ప్ర‌ధాన ఆధార‌మైన‌ పాకిస్తాన్‌కు కేంద్ర నిర్ణ‌యం పెద్ద దెబ్బే. జీలం, చీనాబ్‌, రావి, బియాస్‌, సట్లేజ్ ఉప న‌దుల‌తో కూడిన సింధు న‌ది పాక్‌కు ఆయువు ప‌ట్టు. నీటిపారుద‌ల‌, వ్య‌వ‌సాయం, తాగునీటి కోసం దాయాది దీనిపైనే ఆధార‌ప‌డి ఉంది. ఆ దేశ జాతీయ ఆదాయంలో 23 శాతం వ్య‌వ‌సాయ రంగం నుంచే వ‌స్తుంది. ఇప్పుడు సింధు జ‌లాలను నిలిపి వేస్తే పాక్ ఎడారిగా మార‌పనుంది. తాగునీటి స‌మ‌స్య‌తో పాటు ఆహార సంక్షోభం త‌లెత్త‌డం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌పై భార‌త్ నిర్ణ‌యం ఊహించ‌ని రీతిలో ప్ర‌భావం చూప‌నుంది.

Pahalgam terrorist attack : వాణిజ్యంపైనా ప్ర‌భావం..

వాఘా-అటారి స‌రిహ‌ద్దును wagha-atari border మూసివేయ‌డం ద్వారా భార‌త్.. పాక్ వాణిజ్య రంగంపై pak trading buisness దెబ్బ కొట్టింది. అమృత్‌సర్ నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్టారి భారతదేశపు మొట్టమొదటి ల్యాండ్ పోర్ట్. పాకిస్తాన్‌తో వాణిజ్యం కోసం అనుమతించబడిన ఏకైక భూమార్గం ఇదే. 120 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి, జాతీయ రహదారి-1కి నేరుగా అనుసంధానించిన ఈ చెక్ పోస్ట్ వాణిజ్య ప‌రంగా పాకిస్థాన్‌కు ఎంతో కీల‌కం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ afgan నుంచి దిగుమతులలో కీలక పాత్ర పోషించింది. అటారి-వాఘా కారిడార్ ద్వారా 2023-24లో రూ.3,886.53 కోట్ల విలువైన వాణిజ్యం జ‌రిగింది.

రెండు దేశాల మ‌ధ్య కీలకమైన ఈ మార్గం ద్వారా కీలకమైన భారతీయ ఎగుమతుల్లో సోయాబీన్, కోడి మాంసం, కూరగాయలు, ఎర్ర మిరపకాయలు, ప్లాస్టిక్ దాణా, ప్లాస్టిక్ నూలు(soybean, chicken, vegetables, red chillies, plastic feed, plastic yarn) ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ ఎక్కువగా దిగుమ‌తి చేసుకునే డ్రై ఫ్రూట్స్, డ్రై డేట్స్, జిప్సం, సిమెంట్, గాజు, రాక్ సాల్ట్(dry fruits, dry dates, gypsum, cement, glass, rock salt,), వివిధ మూలికలు ఈ స‌రిహ‌ద్దు నుంచే వెళ్తాయి. పాక్‌కు ఎంతో కీల‌క‌మైన ఈ స‌రిహ‌ద్దును మూసివేయ‌డం ద్వారా వాణిజ్య‌ప‌రంగా పాక్‌కు తీవ్ర న‌ష్టం క‌లుగ‌నుంది.

Must Read
Related News