అక్షరటుడే, గాంధారి: Ration Rice | లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యంను ఓ రేషన్ డీలర్ (Ration dealer) దర్జాగా అమ్మేసుకున్నారు. రేషన్‌షాపు నిర్వాహకుల తీరుపై అనుమానం వచ్చిన ప్రజలు.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది.
ఈ ఘటన గాంధారి (Gandhari) మండలం గండివేట్‌లో జరిగింది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. మండలంలోని గండివేట్లోని (Gandivet) ఓ రేషన్ డీలర్ కొన్నిరోజులుగా రేషన్ బియ్యం పంపిణీ చేయట్లేదు. లబ్ధిదారులు అడిగితే రేపుమాపు అంటూ వారు పొంతనలేని సమాధానం చెబుతూ వస్తున్నారు.
దీంతో విసిగిపోయిన ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ (Enforcement Department) డీటీ సురేష్ విచారణ చేశారు. రేషన్ షాప్‌లో మొత్తంగా 218 క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యం మాయమైనట్లు విచారణలో తేల్చారు. తదుపరి చర్యల నిమిత్తం ఆర్డీవోకు నివేదిక అందజేస్తామని ఆయన వివరించారు.