Homeతాజావార్తలుACB Raids | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన డీసీవో

ACB Raids | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన డీసీవో

మంచిర్యాల జిల్లా కో ఆపరేటివ్​ ఆఫీసర్ రాథోడ్ బిక్కు​ ఏసీబీకి చిక్కాడు. ఓ ఉద్యోగి నుంచి రూ.రెండు లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనను పట్టుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. రూ.రెండు లక్షల లంచం తీసుకుంటూ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ (District Cooperative Officer) రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోయాడు.

అవినీతి అధికారులు మారడం లేదు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా మంచిర్యాలజిల్లా (Mancherial District) కో ఆపరేటివ్​ ఆఫీసర్ రాథోడ్ బిక్కు​ను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. సస్పెండ్ అయిన ఓ ఉద్యోగికి పెరిగిన జీతాలు మంజూరు చేసేందుకు రాథోడ్ రూ.8 లక్షలు డిమాండ్ చేశాడు. అందులో మొదటి విడతగా రూ.రెండు లక్షలు ఇవ్వాలన్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ACB Raids | ఇంట్లోనే..

జిల్లా కేంద్రంలోని ఇక్బల్ అహ్మద్ నగర్​లోని తన నివాసంలో శనివారం డీసీవో రూ.రెండు లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకొని ఇంట్లో, కార్యాలయంలో సోదాలు (ACB Raids) చేపట్టారు. మంచిర్యాల కలెక్టరేట్ (Mancherial Collectorate)​లో ఆయనను విచారిస్తున్నారు. ఆసిఫాబాద్​లోని ఇచ్చోడలోని రాథోడ్ బిక్కు ఇంట్లో సైతం తనిఖీలు నిర్వహించారు.

ACB Raids | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.