అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | డీసీఎం (DCM) వ్యాను ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
ఐదో టౌన్ ఎస్‌హెచ్‌వో గంగాధర్ (SHO Gangadhar) తెలిపిన వివరాల ప్రకారం.. బోయిగల్లి ప్రాంతానికి చెందిన మేస్త్రి పనిచేస్తున్న కిషన్ (42) గాజులపేట్ (Gajulpet) నుంచి వర్ని చౌరస్తా వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. అదే సమయంలో ఆర్ఆర్ చౌరస్తా (RR Chowrastha) నుంచి వర్ని చౌరస్తా వైపు వెళ్తున్న డీసీఎం వ్యాను కిషన్‌ను ఒక్కసారిగా ఢీకొంది. ఈ ఘటనలో కిషన్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పారిపోవడానికి యత్నించిన డీసీఎం డ్రైవర్‌ను పట్టకుని పోలీసులు స్టేషన్‌ను తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఐదో టోన్ ఎస్‌హెచ్‌వో గంగాధర్ వివరించారు.