అక్షరటుడే, ఇందల్వాయి: National Highway | నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి 44పై డీసీఎం బోల్తా పడింది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ (Indalwai police station) పరిధిలోని దేవి తండా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు (Hyderabad to Nizamabad) వెళ్తున్న డీసీఎం శుక్రవారం ఉదయం దేవి తండా వద్ద బోల్తా పడింది.
నిద్ర మత్తులో డ్రైవర్ డివైడర్‌ను డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుంది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కాగా.. ఇందులో డిమార్ట్‌కు సరుకులను తీసుకెళ్తున్నట్లు సమాచారం. డీసీఎం ప్రమాదానికి గురవడంతో మరో వాహనాన్ని ప్రమాద స్థలానికి తీసుకువచ్చి సరుకులను తరలించారు.

