అక్షరటుడే, ఇందల్వాయి : Indalwai | ఇందల్వాయి పోలీస్ స్టేషన్ (Indalwai Police Station) పరిధిలోని దేవి తండా సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం డీసీఎం బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) వైపు నుంచి అంకాపూర్ (Ankapoor) గ్రామానికి అగ్రి సీడ్స్ (Agri Seeds) విత్తనాలు తీసుకెళ్తున్న డీసీఎం టైర్ పేలడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ సమయంలో పక్కన వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Indalwai | జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా
Indalwai | ఇందల్వాయి మండలం దేవి తండాలో జాతీయ రహదారిపై డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
