అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad DCC | జిల్లా కేంద్రంలోని లక్ష్మి కల్యాణ మండపంలో డిసెంబర్ 1న నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు నూతనంగా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్ రెడ్డి (DCC President Nagesh Reddy) తెలిపారు. తన నివాసంలో శనివారం మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ప్రమాణ స్వీకారానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
Nizamabad DCC | కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకుంటాం..
తనపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లకు నగేశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో (sarpanch elections) పార్టీ మద్దతుదారులను అధిక సంఖ్యలో గెలిపించుకుంటామన్నారు.
కొంతమంది బీజేపీ, బీఆర్ఎస్కు (BJP and BRS) చెందిన ప్రతిపక్ష నాయకులు సర్పంచ్ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటే కోర్టు వాటిని తిరస్కరించిందని ఆయన అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. తద్వారా జిల్లా పరిషత్‌పై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అధికసంఖ్యలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Nizamabad DCC | అనేక సంక్షేమఫలాలు అమలు చేశాం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు రుణమాఫీ, రూ.500 బోనస్‌తో పాటు ఉచిత విద్యుత్ (free electricity) అందిస్తున్నామని నగేశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే సిలిండర్ గ్రామాల్లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, ప్రతి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
Nizamabad DCC | జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం..
జిల్లాలోని అందరు నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని డీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని (Congress party) ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. సమావేశంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జావేద్ అక్రమ్, తదితరులు పాల్గొన్నారు.