అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నిజామాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు (Nizamabad District SC and ST Court) పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా (Ravi Gupta) ఉత్తర్వులు జారీ చేశారు.
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన జర్నలిస్ట్‌గా ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ సెల్ రాష్ట్ర కో–కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. కాగా.. దయాకర్ గౌడ్ (Dayakar Goud) పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.
Nizamabad City | దయాకర్ గౌడ్ ప్రస్థానం
- పదో తరగతి నిజామాబాద్ రావుజీ సంఘం ఉన్నత పాఠశాలలో 1991లో పూర్తి చేశారు.
- ఇంటర్మీడియట్ నగరంలోని సీఎస్ఐలో 1991- 1993 వరకు అభ్యసించారు.
- బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1993-96లో డిగ్రీ చదివారు.
- 1997-2001లో నిజామాబాద్ లా కళాశాలలో అభ్యసించారు.
- 2001 బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయ్యారు.
జూనియర్ న్యాయవాదిగా బండారి కృష్ణా వద్ద ప్రాక్టీస్ మొదలు పెట్టారు. జర్నలిస్ట్‌గా ప్రస్థానం మొదలు పెట్టి న్యాయవాదిగా, పీపీగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో (Congress Party) వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర లీగల్ సెల్ కో–కన్వీనర్‌గా సైతం సేవలు అందించారు.