అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagityal | కని పెంచిన తల్లి పట్ల కర్కశంగా వ్యవహరించిందో కూతురు. కన్నతల్లిపై కనికరం లేకుండా.. అడవిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన జగిత్యాల jagityala జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపుర వీధిలో ఉండే బుధవ్వకు కూతురు ఈశ్వరీ ఉంది. రెండు రోజుల క్రితం ఈశ్వరీ తల్లిని తీసుకొని బయటకు వెళ్లింది. ఆమెను అటవీ ప్రాంతంలోకి forest తీసుకెళ్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు gold ornaments తీసుకొని అక్కడే వదిలేసి వచ్చింది. దీంతో రెండు రోజులుగా ఆ వృద్ధురాలు అడవిలో తిండి తిప్పలు లేకుండా తిరిగింది. ఆమెను గమనించిన శ్రీరాములపల్లి sriramulapalli గ్రామానికి చెందిన యువకులు పోలీసులకు police సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు చేరుకొని బుధవ్వను ఆస్పత్రికి hospital తరలించారు.
