Homeజిల్లాలుజనగాంCongress Vice President | అత్తాకోడ‌ళ్లం ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షురాలు ఝాన్సీరెడ్డి

Congress Vice President | అత్తాకోడ‌ళ్లం ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షురాలు ఝాన్సీరెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Congress Vice President | వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు య‌శ‌స్వినిరెడ్డి (Yashaswini Reddy) ఇద్దరం ఎమ్మెల్యేగా పోటీచేస్తామ‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి (Jhansi Reddy) తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కానున్న నేప‌థ్యంలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వ్ అయ్యే అవ‌కాశ‌ముంద‌న్నారు. అక్క‌డి నుంచి య‌శ‌స్వినిరెడ్డి పోటీ చేస్తుంద‌ని, తాను మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తే అక్క‌డి నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఎర్ర‌బెల్లి జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఝాన్సీరెడ్డి స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ (BRS) హ‌యాంలో పంచాయ‌తీరాజ్‌శాఖ‌, స్త్రీనిధి రుణాల్లో గోల్‌మాల్‌, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో (phone tapping case) నిందితుడిగా ఉన్న ద‌యాక‌ర్‌రావు.. దోషిగా తేలుతారన్నారు.

Congress Vice President | రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌..

పాల‌కుర్తిలో (Palakurti) కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయ‌డం, రాజ‌కీయంగా ఝాన్సీరెడ్డి నిల‌దొక్కుకోవ‌డం కొంత మంది నాయ‌కుల‌కు రుచించ‌డం లేద‌ని ఆమె తెలిపారు. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గంలో నియతృత్వం రాజ్య‌మేలితే.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్న పాల‌న కొన‌సాగ‌డం వారికి న‌చ్చ‌డం లేద‌ని ప‌రోక్షంగా ఎర్ర‌బెల్లిని (Errabelli) ఉద్దేశించి విమ‌ర్శించారు. త‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ కొట్టేందుకు, కుటుంబ స‌భ్యులను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఎవ‌రు చేయిస్తున్నారో అంద‌రికీ తెలుసేన‌ని వ్యాఖ్యానించారు. కుట్ర‌లు చేసే వారిలో సొంత పార్టీ నేతలు కూడా ఉన్నార‌న్న ఝాన్సీరెడ్డి (Jhansi Reddy).. బ‌య‌ట శ‌త్రువుల‌ను ఎదుర్కోవ‌డం క‌ష్టం కాద‌ని, కానీ కోవ‌ర్టులను క‌నిపెట్ట‌డం అంత సులువు కాద‌న్నారు. అన్నింటికీ సిద్ధ‌ప‌డే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, త‌న‌ది రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబ‌మేన‌న్నారు.

Congress Vice President | విభేదాల్లేవు..

అత్తాకోడ‌ళ్ల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఝాన్సీరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే య‌శ‌స్విని (MLA Yashaswini) త‌న‌కు కోడ‌లు కాద‌ని, కూతురి లెక్క అని చెప్పారు. త‌న కోసం అమెరికాలో మంచి జీవితాన్ని వ‌దిలేసుకుని ఇక్క‌డ‌కు వ‌చ్చింద‌న్నారు. త‌మ మ‌ధ్య విభేదాలున్నాయ‌ని, అత్తాకోడ‌ళ్ల‌కు ప‌డ‌ట్లేద‌ని గిట్ట‌ని వాళ్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.