ePaper
More
    HomeజాతీయంViral incident | ఫుడ్ అడిగినందుకు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు

    Viral incident | ఫుడ్ అడిగినందుకు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Viral incident | నానాటికి వివాహ బంధానికి బీటలు వారుతున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు, వరకట్న వేధింపులు, ఇతర సమస్యలతో భార్యాభర్తలు ఒకరిపై మరొకరు పగతో రగిలిపోతున్నారు. ఈ క్ర‌మంలో వారి వారి కుటుంబ స‌భ్యుల మ‌ధ్య కూడా ప‌గ ప్ర‌తీకారాలు ఎక్కువ అవుతున్నాయి. సొంత మామ‌ని నిలువునా మంటల్లో తగలబెట్టేసిన మహాఇల్లాలి బాగోతం తాజాగా వెలుగుచూసింది. ఈ అమానుష ఘటన ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కాని, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. అయితే అదృష్టం బాగుండి ఆ మామ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌ట్టాడు.

    Viral incident | అమానుషం..

    ఆహారం అడిగిన మామపై కోడలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన హృదయవిదారక ఘటన తమిళనాడు(Tamilnadu)లో జరిగిందని తెలుస్తోంది. ఈ అమానుష చర్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడు గత కొంతకాలంగా తన కుమారుడు, కోడలితో కలిసి నివసిస్తున్నాడు. శారీరకంగా బలహీనంగా ఉండే అతడు దినసరి అవసరాల కోసం ఇతరులపై ఆధారపడేవాడు. ఆదివారం రాత్రి అతడు తన కోడలిని ఆహారం కావాలంటూ అడిగాడు. అయితే ఆమెకు కోపం వచ్చి గొడవ పెట్టుకుంది. ఆపై పెట్రోల్(Petrol) పోసి నిప్పు పెట్టినట్లు సమాచారం.

    వృద్ధుడు ఆ మంట‌తో కేకలు వేశాడు. స్థానికులు స్పందించి వెంటనే అతన్ని హాస్పిటల్‌(Hospital)కు తరలించారు. ప్రస్తుతం అతని ముఖం అంతా కాలిపోయింది. ప్రాణానికి పెద్ద ప్ర‌మాదం ఏమి లేద‌ని వైద్యులు అంటున్నారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు(Tamilnadu Police) కోడలిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...