అక్షరటుడే, వెబ్డెస్క్ : Hanmakonda | తమకు అన్ని చేకూర్చిన తల్లిదండ్రుల(Parents)ను కొందరు పెద్దయ్యాక మర్చిపోతారు. తమ ఎదుగుదలకు కారణమైన కన్నవారిని భార్య రాగానే తిప్పలు పెడతారు. తమ కోసం ఎన్నో త్యాగాలు చేసి అమ్మనాన్నలకు వృద్ధాప్యంలో పట్టించుకోరు. ఇలాంటి ఘటనే హన్మకొండ (Hanmakonda) జిల్లా పరకాల మండలం సీతారాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
సీతారాంపూర్ గ్రామానికి చెందిన కొమురమ్మ, సమ్మయ్య అనే దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు తమ ఆస్తి(Property)ని ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చారు. అయితే ఇప్పుడు అన్నం పెట్టమంటే కోడలు చెప్పుతో కొడుతోందని వారు వాపోయారు. ఈ మేరకు బాధితులు మంగళవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు.
ఆస్తి పంచిపెట్టిన తర్వాత తమకు అన్నం పెట్టడం లేదని, అన్నం పెట్టమంటే కోడలు చెప్పుతో కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పట్టించుకోని వారికి ఆస్తి ఎందుకు ఇవ్వాలని, తమ ఆస్తి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.