అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు (BJP Leader) బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)ను ఉపరాష్ట్రపతి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) డిమాండ్ చేశారు. ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhad) ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నిక నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి (Vice President) పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనకు పదవి ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలుగు వారికి సరైన గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. తాను ఇండియా కూటమి తరఫున కాకుండా.. తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడుతున్నాని రేవంత్ రెడ్డి అన్నారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమితో మాట్లాడుతానని పేర్కొన్నారు. కాగా దత్తాత్రేయ మొన్నటి వరకు హర్యానా గవర్నర్గా పని చేశారు.
CM Revanth Reddy | బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం
బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని సీఎం అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారని ఆయన గుర్తు చేశారు. కానీ కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు మాత్రం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల్లో నుంచి ముస్లింలను తీసేయాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అక్కడ ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఇక్కడ మాట్లాడండని చురకలు వేశారు.
CM Revanth Reddy | కేంద్రంపై ఒత్తిడి తేవడానికి..
రాష్ట్రంలో కుల గణన (Caste Census)ను విజయవంతంగా నిర్వహించామని సీఎం తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. ఆ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపేలా.. ఒత్తిడి తేవాలని రాహుల్, ఖర్గేను కోరడానికి ఢిల్లీ వెళ్లినట్లు ఆయన చెప్పారు. గురువారం రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై వివరిస్తామని ఆయన తెలిపారు.