HomeజాతీయంAyodhya | అయోధ్యలో రెండు రోజుల పాటు దర్శనాలు నిలిపివేత​.. ఎందుకంటే?

Ayodhya | అయోధ్యలో రెండు రోజుల పాటు దర్శనాలు నిలిపివేత​.. ఎందుకంటే?

అయోధ్య రామ మందిరంలో ఈ నెల 24, 25 తేదీల్లో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. 25న శిఖర ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya | ఉత్తరప్రదేశ్​లోని శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రెండు రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ నెల 24 సాయంత్రం నుంచి 26 ఉదయం 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించమని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.

అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple)లో ధ్వజారోహణ కార్యక్రమానికి వీలుగా నవంబర్ 24 సాయంత్రం నుంచి శ్రీరామ జన్మభూమి ఆలయం మూసి వేయనున్నారు. నవంబర్ 25న జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (National Swayamsevak Sangh) చీఫ్ మోహన్ భగవత్ సహా ప్రముఖులు పాల్గొంటారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయడానికి శ్రీరాముడి దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ తెలిపారు. వివాహ పంచమి సందర్భంగా 25న ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సీతారాముల దివ్య వివాహానికి గుర్తుగా ఈ వేడుక జరుపుతారు. త్రిభుజాకార ఆకారంలో ఉన్న ఈ జెండాను ప్రధాని మోదీ, భగవత్ 190 అడుగుల ఎత్తులో ఎగురవేస్తారు.

Ayodhya | ఉత్సవ ప్రాముఖ్యత

జెండా ఎగురవేయడం హిందువులకు ఒక ముఖ్యమైన సాంస్కృతిక సందర్భాన్ని సూచిస్తుంది. ఇది ప్రముఖ మతపరమైన ప్రదేశంగా ఆలయ హోదాను బలోపేతం చేస్తుంది. ఈ వేడుక మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది, ఆ తర్వాత అతిథులు శ్రీరాముడి దర్శనం చేసుకుంటారు. దీనికి దాదాపు మూడు గంటలు పట్టవచ్చని అంచనా. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ (UP Governor Anandiben Patel), ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath)సహా ఇతర ప్రముఖులు కూడా ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో రెండు రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతించరు. ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తులు దర్శనం చేసుకోవచ్చు.

Must Read
Related News