అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారి ఆలయం (Srivari Temple)లో సోమవారం ఉదయం దర్శనాలు ప్రారంభం అయ్యాయి. చంద్రగ్రహణం (Lunar eclipse) నేపథ్యంలో ఆలయాన్ని మూసి వేసిన విషయం తెలిసిందే.
చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9.50 నుంచి 1.31 గంటల వరకు చంద్ర గ్రహణం ఉండటంతో.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
Tirumala | అన్నప్రసాద వితరణ..
చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సు (Annaprasadam Complex)ను మూసివేశారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు దానిని తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది.