అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS)పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడడానికి రాజీవ్‌గాంధీ సద్బావన యాత్ర చేపట్టారన్నారు. ఆ కార్యక్రమాన్ని నేటికి కొనసాగిస్తుండడం అభినందనీయమన్నారు. సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షిద్‌ను రాజీవ్ సద్భావన అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
CM Revanth Reddy | బీజేపీకి బీ టీమ్
బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్‌గా మారిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఆ 8 స్థానాల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37 శాతం ఓట్లు వచ్చాయని, నాలుగు నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 15 శాతం ఓట్లే వచ్చాయన్నారు. మిగతా 22 శాతం ఓట్లు ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. ఆ ఓట్లు బీజేపీకి వెళ్లాయన్నారు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికల్లోనూ ఇదే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలని ఆయన ప్రజలను కోరారు. జరగబోయే ఎన్నికల్లో చీలిక తీసుకు రావాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు. రిజర్వేషన్లు పెరగకుండా ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కులగణన చేపట్టిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లులు ఆమోదించినట్లు గుర్తు చేశారు. దీనికి న్యాయవ్యవస్థలో చిక్కులు వస్తున్నాయన్నారు. తాము చిత్తశుద్ధితో రిజర్వేషన్ల కోసం ఆలోచిస్తుంటే.. కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీనియర్ నాయకులు వి హనుమంతురావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.
1 comment
[…] భిక్ష కాదన్నారు.సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేవలం డైవర్షన్ పాలిటిక్స్ […]
Comments are closed.