అక్షరటుడే, ఇందూరు: Best Dance Teacher Award : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ శివాని నృత్య కళాశాల గురువు తాళ్లపల్లి నవనీత గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది.
హైదరాబాద్(Hyderabad) లోని రవీంద్ర భారతి(Ravindra Bharathi) లో సిరాజ్ డాన్స్ Siraj Dance, ఆర్ట్స్ అకాడమీ Arts Academy ఆధ్వర్యంలో భారతీయ కళా వైభవం -2025 (Bharatiya Kala Vaibhavam-2025) కార్యక్రమంలో నాట్య గురువులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి డా.బుర్గుల మధుసూదన్, సరస్వతి ఉపాసకులు దైవజ్క్ శర్మ, ప్రొడ్యూసర్, నటి డా.రాజ కౌశిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభను చాటుకున్న వారిని ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి Nizamabad district చెందిన నవనీత గౌడ్ కు ఉత్తమ నాట్య గురువు పురస్కారం అందుకున్నారు.
రవీంధ్రభారతిలో నవనీత గౌడ్ నేతృత్వంలోని శివాని అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో అలరించారు. నవనీత గౌడ్ శివాని నాట్యమండలిని నెలకొల్పి చిన్నారులకు నృత్యంలో శిక్షణ ఇస్తూ వారిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలకు పంపి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో భరత నాట్యం Bharatanatyam, కూచిపూడి Kuchipudi నృత్యాల తరగతులు నిర్వహిస్తూ చిన్నారులను నృత్యంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. నాట్య గురువు నవనీత గౌడ్ కు రాష్ట్ర స్థాయి నాట్య గురువు పురస్కారం దక్కడం పట్ల జిల్లా ప్రజలు, ప్రముఖులు, కళాకారులు అభినందనలు తెలియజేశారు.
