అక్షరటుడే, ఇందూరు : Dampalli Jyothi Campaign | ఒక్కసారి తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇస్తే 39వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని (BJP Corporator Candidate) దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ అన్నారు. ఈ మేరకు కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
Dampalli Jyothi Campaign | ఎల్లవేళలా ప్రజల మధ్యే ఉంటా..
ఈ సందర్భంగా దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. పలు కాలనీల్లో సమస్యలను ప్రజలు వివరించగా తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి మేయర్ పీఠం కైవసం చేసుకుందామని ఆమె వెల్లడించారు.
ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో..
నగరంలో బీజేపీ (BJP) ప్రజా ప్రతినిధుల సహకారంతో ముందుకెళ్తామని జ్యోతి మురళీకృష్ణ తెలిపారు. డివిజన్లో అనేక సమస్యలను తాము గుర్తించామని.. కార్పొరేటర్‌గా గెలవగానే ముందుగా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు (BJP Leaders), కార్యకర్తలు పాల్గొన్నారు.
