అక్షరటుడే, ఇందూరు : Dampalli Jyothi Campaign | నగరంలోని 39వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని.. ఆదరించి గెలిపించాలని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని (BJP Corporator Candidate) దాంపల్లి జ్యోతి మురళికృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.
Dampalli Jyothi Campaign | సమస్యలపై అవగాహన ఉంది..
డివిజన్లో తనకు మద్దతిచ్చి గెలిపిస్తే ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జ్యోతి మురళికృష్ణ అన్నారు. ఈ మేరకు ప్రజలతో మమేకమై ముందుకు కదిలారు. తనను నమ్మి గెలిపించాలని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్లు ప్రజల మధ్యే ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
బీజేపీతోనే (BJP) అభివృద్ధి సాధ్యమని ఎంపీ , ఎమ్మెల్యే (MLA) సహకారంతో డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని దాంపల్లి జ్యోతి మురళికృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు. తనను మీ ఇంటి ఆడబిడ్డగా భావించి ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు (BJP Leaders), కార్యకర్తలు పాల్గొన్నారు.
