అక్షరటుడే, బాన్సువాడ:Banswada | ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి పాడి రైతు(Dairy farmer) మృతి చెందిన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి(Annaram Village) చెందిన పాడి రైతు సాయిబాబా శుక్రవారం సాయంత్రం గేదెలు కడగడానికి కుంటలోకి తీసుకెళ్లాడు. గేదెలను శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడి మునిగిపోయాడు. స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
