అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Horoscope | జ్యోతిష్య శాస్త్ర గణాంకాల ప్రకారం.. ఈరోజు గ్రహాల స్థానాలు భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.
ఉద్యోగస్థులు, వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారికి శ్రద్ధ అవసరం. కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ఇంకొందరికి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది.
మేషరాశి Aries : Today Horoscope : అనవసరమైన ఆలోచనలను మనసులోకి రాకుండా చూసుకోండి. ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తే.. మానసిక శక్తిని పెంచుతుంది.
డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉండాలంటే, తెలుపు రంగు కుక్కను పెంచుకోండి.
వృషభ రాశి Taurus : Today Horoscope: ఆరోగ్యపరంగా చాలా మంచి రోజు. ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి కావాల్సిన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.
కొంచెం అదనపు ఆదాయం సంపాదించడానికి కొత్త ఆలోచనలు చేయాలి. లక్ష్యాల దిశగా మౌనంగా పనిచేసుకుంటూ పోవాలి. వృత్తిలో నిరంతర వృద్ధి కోసం పూజ గదిని మార్చకుండా చూసుకోవాలి.
మిథున రాశి Gemini : Today Horoscope: ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించి, వ్యాయామాలపై దృష్టి పెట్టాలి. ఇటీవలి కొన్ని ఘటనల వల్ల మనస్సు కలత చెంది ఉంటుంది.
ధ్యానం, యోగా చేయడం ద్వారా శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందగలరు. చాలా కాలంగా వసూలు కాని బాకీలు ఇవాళ వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి Cancer : మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి, ఏదైనా సామాజిక సమావేశంలో పాల్గొనాలి. గ్రహాలు, నక్షత్రాల అనుకూలత వల్ల ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, మంచి ప్రవర్తన కొత్త స్నేహితులను పరిచయం చేస్తుంది. తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయడం ద్వారా జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవచ్చు.
సింహ రాశి Leo : కొన్ని పనుల్లో కొంత ఆలస్యం లేదా ఆటంకం కనిపించవచ్చు. ధైర్యం కోల్పోకుండా.. అనుకున్న ఫలితం వచ్చేవరకు మరింత కఠినంగా శ్రమించండి.
గతంలో చేసిన పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఇస్తాయి. ఇవాళ లక్ష్యాలను సాధారణం కంటే ఎక్కువగా సెట్ చేసుకుంటారు. కుటుంబంలో అనుకూలమైన, ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే.. తండ్రి పట్ల విధేయత చూపించండి.
కన్య రాశి Virgo : బాధలో ఉన్నవారికి సహాయం చేయండి. రాత్రిలోపు ఆర్థికంగా లాభాలు పొందవచ్చు. ఎందుకంటే.. ఎవరికైతే అప్పు ఇచ్చారో ఆ డబ్బు తిరిగి వసూలు అవుతుంది.
ఆగిపోయిన (పెండింగ్‌లో ఉన్న) ప్రతిపాదనలు (ప్రపోజల్స్) ఇవాళ అమలుకు నోచుకుంటాయి. ఆరోగ్యకరమైన జీవితాన్ని కాపాడుకోవడానికి.. ఆకుపచ్చ దుస్తులు, గాజులను నపుంసకులకు (ట్రాన్స్‌జెండర్) దానం చేయండి.
తుల రాశి Libra : ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ బాధ్యతలు ఆందోళనను పెంచవచ్చు. పని విషయంలో అన్ని అంశాలూ అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ప్రయాణం చేయడం వల్ల కొత్త ప్రదేశాలు చూడటానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి అవకాశం లభిస్తుంది. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించడానికి పార్వతి మంగల్ స్తోత్రాన్ని చదవండి.
వృశ్చిక రాశి Scorpio : ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఎంత బిజీగా ఉన్నా అలసటను సులభంగా అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్‌లో తగినంత డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది.
ప్రయాణ ప్రణాళికలు ఏవైనా ఉంటే.. చివరి నిమిషంలో వచ్చిన మార్పుల కారణంగా వాయిదా పడతాయి. సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. వేయించిన ఆహారాన్ని (పకోడాలు వంటివి) కాకులకు ఆహారంగా వేయాలి.
ధనుస్సు రాశి Sagittarius : స్నేహితులు మద్దతుగా ఉండి సంతోషాన్ని కలిగిస్తారు. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ప్రేమ, స్నేహం బంధాలు మరింత బలపడతాయి.
మీ పనులను ఇతరులతో చేయించడానికి ప్రయత్నించకుండా.. మీరే పూర్తి చేయండి. దీనివల్ల మంచి ప్రశంసలు పొందుతారు. అపార్థాలు లేని, ఆనందకరమైన జీవితం కోసం.. గోధుమ రంగు ఆవులకు బెల్లం, రొట్టెల వంటి ఆహారాన్నిపెట్టండి.
మకర రాశి Capricorn : ఖర్చు చేసే విధానాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ప్రయాణంలో ఉన్నట్లయితే, వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
అజాగ్రత్తగా ఉంటే వాటిని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఇవాళ పని విషయంలో సీనియర్లు చాలా సహాయంగా ఉంటారు. ఈ రాశి వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు.
కొన్నిసార్లు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ మరికొన్నిసార్లు ఒంటరిగా ఉంటారు. మంచి ఆర్థిక లాభాలను పొందడానికి.. వెండి గిన్నెలో పెరుగు తినండి.
కుంభ రాశి Aquarius : స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి చేసే చిన్నపాటి విహారయాత్ర రిలాక్స్ నిస్తుంది. తెలివిగా చేసిన పెట్టుబడులు మాత్రమే లాభాలుగా తిరిగి వస్తాయి.
కుటుంబంలో అధికారం చెలాయించే (దబాయింపు) స్వభావాన్ని మార్చుకోవాల్సిన సమయం ఇది. ఆఫీసులో ఇవాళ మంచి ఎదుగుదలకు అవకాశం ఉంది.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని పొందడానికి, పార్వతి మంగల్ స్తోత్రాన్ని చదవండి.
మీన రాశి Pisces : సహాయం చేసే మనసు మీకు ఒక వరంగా పనిచేస్తుంది. సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఈర్ష్య వంటి దుష్ట స్వభావాల నుంచి అది మిమ్మల్ని కనిపించకుండానే కాపాడుతుంది.
ఇంతకాలంగా మీ బాస్ ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించారో అర్థమవుతుంది. రోజువారీ దుస్తుల్లో క్రీమ్, తెలుపు లేదా లేత రంగులను ధరించండి. ఇది వృత్తి జీవితంలో మరింత పవిత్రతను, అనుకూలతను తెస్తుంది.

