HomeUncategorizedMumbai Lifestyle | వామ్మో..! ముంబై లోకల్ ట్రైన్స్ రద్దీ.. రోజుకు ఏడుగురి చొప్పున మృతి!

Mumbai Lifestyle | వామ్మో..! ముంబై లోకల్ ట్రైన్స్ రద్దీ.. రోజుకు ఏడుగురి చొప్పున మృతి!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mumbai Lifestyle | ముంబై, భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలవబడే మహానగరం. వేగవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందిన ఈ న‌గరంలో వేగం వెన‌క‌ అణగారిన వాస్తవం ఉంది. ముంబై లోకల్ రైల్వేలో నిత్యం జరుగుతున్న ప్రాణనష్టం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ముంబై లోకల్ ట్రైన్స్‌(Mumbai Local Trains)లోని తీవ్ర రద్దీ కారణంగా, రోజుకు కనీసం 7 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని ముంబై రైల్వే పోలీస్(Mumbai Railway Police) డేటా వెల్లడిస్తోంది.

Mumbai Lifestyle | ప్ర‌మాద‌క‌ర ప్రయాణం..

ముంబై లోకల్ రైలు వ్యవస్థ, రోజూ 75 లక్షల మందికిపైగా ప్రయాణికుల‌కు(Passengers) సేవ‌లు అందిస్తుంది. ట్రైన్ల సంఖ్య త‌క్కువ కాగా, గడిచిన దశాబ్దాల్లో పెరిగిన జనాభా, త‌క్కువ ప్లాట్‌ఫారాల వల్ల, ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. ఎక్కువ మంది బయటకు వేలాడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి, ప్రమాదాలకు కారణమవుతోంది. ముంబైలో రోజుకు సగటున ఏడుగురు ప్రయాణికులు రైలు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది రద్దీ కారణంగా రైలు నుంచి జారిపడి, లేదా పట్టాలపై పడిపోయి మరణిస్తున్నారు. ప్రతీ సంవత్సరం సుమారు 2,500+ మంది ఈ రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

బయట వేలాడుతూ ప్రయాణించేవారు ట్రైన్ స్టాపింగ్(Train stopping) సమయంలో పడిపోవడం, గేట్లు లేకపోవడం వల్ల రైలు కింద పడి మరణించడం జ‌రుగుతోంది. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. చాలా మంది యువకులు, రోజువారీ కార్మికులు ఇందులో మృతి చెందుతున్నారు. సురక్షిత రైలు ప్రయాణానికి అనేక ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ, అమలు కావ‌డం లేదు. పాతపడ్డ రైలు బోగీలను మార్చడం, డోర్ ఆటోమేషన్(Door automation) అమలు చేయడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల సంఖ్య పెంచడం వంటి కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయి. CCTVలు, మొబైల్ అలర్ట్స్, హెల్ప్‌లైన్ నెంబర్లు వంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాస్తవ సమస్య పరిష్కారానికి ఇవి చక్కటి పరిష్కారాలు కావు. ప్రయాణికుల్లో సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంచాలి. మెట్రో, బస్సులు వంటి ఇతర మార్గాలను ప్రోత్సహించాలి. ముంబై నగరానికి లోకల్ ట్రైన్ జీవన రేఖ వంటిది అయినా, అది ప్రయాణికుల ప్రాణాలను తీసే ప్రమాదకర మార్గంగా మారుతోందంటే ఆలోచించ‌క త‌ప్ప‌దు.