అక్షరటుడే, నిజాంసాగర్: KTR | ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ ఛైర్మన్(Former ZP Chairman) దఫేదార్ రాజు, మనకోసం–మనం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కిషోర్ కుమార్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ భవన్లో (Telangana Bhavan) జరిగిన కార్యక్రమానికి వారు హాజరై కేటీఆర్‌ను కలిశారు. జ్ఞాపిక అందజేసి శుభాకాంఓలు తెలిపారు.
KTR | కామారెడ్డి పట్టణంలో..
అక్షరటుడే, కామారెడ్డి: కేటీఆర్ జన్మదిన వేడుకలను కామారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Former MLA Gampa Govardhan) నివాసం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్ధీన్(BRS District President Mujibodheen) కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. తమ నాయకుడు కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణంలో కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్