అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dadasaheb Phalke Awards | చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke International Film Festival) అవార్డ్స్.
ఈ అవార్డు అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమ, భారతీయ సినిమా, భారతీయ టెలివిజన్ ప్రతిభను జరుపుకునేందుకు, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే వారసత్వాన్ని నిలబెట్టడానికి ప్రతి ఏటా ప్రకటిస్తుంటారు. ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) 2025 10వ ఎడిషన్ అక్టోబర్ 29, 30 తేదీల్లో ముంబైలోని వర్లిలో జరిగింది. విజేతలను గురువారం ప్రకటించారు.
Dadasaheb Phalke Awards | అవార్డు విజేతలు..
ఉత్తమ చిత్రంగా స్ట్రీ 2 అవార్డు గెలుచుకోగా.. పంచాయత్ 3 (Panchayat 3) ఉత్తమ వెబ్ సిరీస్చ ఉత్తమ నటుడు (విమర్శకుల ఎంపిక) అవార్డులను గెలుచుకుంది. యే రిష్టా క్యా కెహ్లతా హైని ఉత్తమ టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు. ఉత్తమ దర్శకుడు: కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్), నిర్మాత: దినేష్ విజన్, విమర్శకుల ఎంపిక ఉత్తమ చిత్రం: లాపాటా లేడీస్, ఉత్తమ నటుడిగా కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటిగా కృతి సనన్, విమర్శకుల ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (సెక్టర్ 36), ఉత్తమ నటి: నితాన్షి గోయెల్ (లాపాటా లేడీస్) ఎంపికయ్యారు.
Dadasaheb Phalke Awards | తెలుగు సినిమాలకు..
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కీ 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా నిలిచింది. సంవత్సరంలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడిగా అల్లు అర్జున్ (Allu Arjun), నటిగా సాయి పల్లవి ఎంపికయ్యారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దేవీ శ్రీ ప్రసాద్‌ను వరించింది.
