HomeజాతీయంShakti Cyclone | దూసుకొస్తున్న శక్తి తుపాన్​.. ఆ రాష్ట్రాల్లో హై అలెర్ట్​

Shakti Cyclone | దూసుకొస్తున్న శక్తి తుపాన్​.. ఆ రాష్ట్రాల్లో హై అలెర్ట్​

అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుపాన్​ వేగంగా దూసుకు వస్తోంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాలకు హై అలెర్ట్​ జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shakti Cyclone | అరేబియా సముద్రం (Arabian Sea) అల్లకల్లోలంగా మారింది. శక్తి తుపాన్​ దూసుకు వస్తోంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్​ గుజరాత్‌ (Gurjarat)లోని ద్వారకకు 420 కి.మీ. దూరంలో ఉంది. ప్రస్తుతం నైరుతి దిశగా కదులుతోంది. ఆదివారం పశ్చిమ మధ్య అరేబియా సముద్రానికి, సోమవారం ఈశాన్య దిశగా కదులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తీర ప్రాంతాల్లో సముద్రం భయంకరంగా మారింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Shakti Cyclone | ముంబైకి పొంచి ఉన్న ముప్పు

ఈ ఏడాది భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) అతలాకుతలం అవుతోంది. తాజాగా శక్తి సైక్లోన్​ ధాటికి మరోసారి కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తుపాన్‌ దూసుకు వస్తుండటంతో మహారాష్ట్ర, గుజరాత్​లో హై అలెర్ట్​ ప్రకటించారు. మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్‌లలో శనివారం నుంచి మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. గంటకు 65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Shakti Cyclone | అప్రమత్తంగా అధికారులు

సైక్లోన్​ శక్తి ముప్పు పొంచి ఉండటంతో మహారాష్ట్ర, గుజరాత్​లో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆయా రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలను అలెర్ట్‌ చేశారు. తుపాన్​ను ఎదుర్కోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ సైక్లోన్​ సోమవారం నాటికి ఈశాన్య దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.