HomeతెలంగాణWeather Updates | తీరం దాటిన వాయుగుండం.. నేడు పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్​

Weather Updates | తీరం దాటిన వాయుగుండం.. నేడు పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) తెలిపారు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్​, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్​, ఖమ్మం, హన్మకొండ, వరంగల్​ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడుతాయి.

Weather Updates | ఉత్తరాంధ్రలో బీభత్సం

వాయుగుండం ఎఫెక్ట్​తో ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, భోగాపురం మండలాల్లో వందల ఎకరాల్లో అరటి పంట నీట మునిగింది. శ్రీకాకుళం జిల్లాలోని పది మండలాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో చంపావతి నది ఉధృతంగా పారుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Weather Updates | ప్రారంభమైన కోతలు.. రైతుల ఆందోళన

తెలంగాణ(Telangana)లో వరికోతలు ప్రారంభం అయ్యాయి. ముందస్తుగా సాగు చేసిన పొలాలను రైతులు కోస్తున్నారు. అయితే వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భూములు తడిగా ఉండటంతో రైతులు చైన్​ మిషన్లతో కోతలు కోస్తున్నారు. అయితే వర్షాలతో వడ్లు ఎండబోయడం ఎలా అని భయపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు.