Homeజిల్లాలుకామారెడ్డిPolice Martyrs Week | అమరులను స్మరించుకునేందుకే సైకిల్​ ర్యాలీ: ఎస్పీ రాజేష్​ చంద్ర

Police Martyrs Week | అమరులను స్మరించుకునేందుకే సైకిల్​ ర్యాలీ: ఎస్పీ రాజేష్​ చంద్ర

అమరులైన పోలీసులను స్మరించుకునేందుకు సైకిల్​ ర్యాలీ నిర్వహించినట్లు ఎస్పీ రాజేష్ ​చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Police Martyrs Week | అమరులను స్మరించుకునేందుకే సైకిల్​ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలో పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

రాజంపేట (Rajampet) మండలం పొందుర్తి బైపాస్ రహదారి వద్ద జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీసు శాఖ సిబ్బందితో (Kamareddy SP) పాటు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. పొందుర్తి నుంచి కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియం (Kalabharti Auditorium) వరకు 9 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగిందని.. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతిఒక్కరికి ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.