ePaper
More
    Homeక్రైంCyberabad Police | దాబాలో వంటవాడు.. తెర వెనుక డ్రగ్స్​ దందా

    Cyberabad Police | దాబాలో వంటవాడు.. తెర వెనుక డ్రగ్స్​ దందా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | అతను దాబాలో వంట(COOK) చేస్తూ జీవనం సాగిస్తాడు. బయట ఎవరైనా చూస్తే వంటవాడిలాగే కనిపిస్తాడు. కానీ తెరవెనుక డ్రగ్స్​ దాందాలో ఆరి తేరాడు. దాబాకు వచ్చే కస్టమర్లు, లారీ, ట్రక్​ డ్రైవర్లే లక్ష్యంగా డ్రగ్స్​ విక్రయిస్తూ రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. దాబాపై దాడి చేసి పోలీసులు రూ.కోట్లల్లో విలువైన డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారంటే.. అతను ఏ స్థాయిలో దందా చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

    Cyberabad Police | రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

    హైదరాబాద్ (Hyderabad)​ శివారులో పోలీసులు భారీగా డ్రగ్స్ (Huge Drugs)​ స్వాధీనం చేసుకున్నారు. రూ.3 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ (shad nagar police station ) పరిధిలోని NH-44లోని రాయికల్ టోల్ గేట్ సమీపంలోని సంజు బాయ్ మార్వాడి దాబా(Sanju bhai dhaba) సమీపంలో నిందితుడిని సైబరాబాద్​ పోలీసులు(Cyberabad Police) అరెస్ట్ చేశారు.

    సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్ (Cyberabad CP)​ అవినాష్ మొహంతి(CP Avinash Mohanty) శుక్రవారం కేసు వివరాలు వెల్లడించారు. సంజు బాయ్ మార్వాడి దాబాలో పనిచేస్తున్న 26 ఏళ్ల వంట మాస్టర్ వికాస్ సోహు డ్రగ్స్​ దందా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాబాపై దాడి చేసి నిందితుడిని అరెస్ట్​ చేశామన్నారు. అతని నుంచి 1.5 కిలోల హెరాయిన్, 632 గ్రాముల నల్లమందు, 2.8 కిలోల గంజాయి గడ్డి, కిలో గంజాయితో పాటు రూ.89,700 నగదు, డిజిటల్ తూకం యంత్రం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​ విలువ రూ.మూడు కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.

    Cyberabad Police | జైలుకు వెళ్లొచ్చినా మారని తీరు

    రాజస్థాన్‌(Rajastan)లోని నాగౌర్ జిల్లాలోని మౌలాసర్ గ్రామానికి చెందిన వికాస్ 2019 నుంచి దాబాలో పని చేస్తున్నాడు. వాచ్​మన్​గా దాబాలో చేరిన వికాస్​.. ప్రస్తుతం వంటవాడిగా(Cook) ఎదిగాడు. అయితే వంటమనిషిగా పనిచేస్తూనే డ్రగ్స్​ అక్రమ రవాణాలో ఆరితేరాడు. దాబా యజమాని సంజు బాయ్ ప్రభావంతో అతనికి దూమపానం మరియు గంజాయి అమ్మకం అలవాటు అయినట్లు పోలీసులు తెలిపారు. 2022లో వికాస్, సంజు బాయ్ ఇద్దరినీ గంజాయి అమ్మినందుకు జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు.

    జైలు నుంచి విడుదలైన తర్వాత వారు తమ అక్రమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించారు. 2025 ఏప్రిల్​లో సంజు భాయ్ మరణించిన తర్వాత వికాస్ సొంతంగా దందాకు తెరలేపాడు. ధూల్‌పేట నివాసి సలీం, జల్‌పల్లి నివాసి రాజు, మధ్యప్రదేశ్ నుంచి వికాస్​ డ్రగ్స్​ సేకరించాడని సీపీ వివరించారు.

    Cyberabad Police | మూడు రెట్ల అధిక ధరకు..

    వికాస్​ తాను కొనుగోలు చేసిన ధర కంటే మూడు రెట్ల అధిక రేటుకు డ్రగ్స్​ విక్రయించేవాడు. ఇందులో లాభాలు బాగా ఉండటంతో దందాను విస్తరించాడు. ఎక్కువగా ట్రక్ డ్రైవర్లు, అంతర్రాష్ట్ర ప్రయాణికులు, దాబాలోని కస్టమర్లకు డ్రగ్స్​ విక్రయించేవాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్ట్​ చేసి రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టుకున్నారు.

    More like this

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్ ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో ఈనెల 10న...

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...