అక్షరటుడే, హైదరాబాద్: Cyber Crime : అది హైదరాబాద్ (Hyderabad) లోని ప్రైమ్ లొకేషన్ (prime location).. అక్కడ అందరూ ఐటీ ఎంప్లాయీస్ (IT employees), ప్రైవేటు ఉద్యోగులు (private employees) ఉంటారు. ఉదయం లేవగానే హడావుడిగా రెడీ అయి, డ్యూటీకి వెళ్లడం.. రాత్రికి ఇంటికి చేరాక, సేద తీరడం ఇక్కడే ఇదే సందడి ఉంటుంది.
ఇదే తమకు అనువైన ప్రదేశం అనుకున్నారేమో ఆ సైబర్ నేరగాళ్లు.. ఏకంగా విల్లా(villa)నే తమ అడ్డాగా చేసుకున్నారు. అక్రమాలకు తెర లేపారు. సైబర్ లూటీలకు పాల్పడటం మొదలెట్టారు. అమాయకులను ప్రలోభపెట్టి భారీగానే దోచుకున్నారు. రూ.లక్షలు కూడబెట్టారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్‌లో భారీ సైబర్ గ్యాంగ్ cyber gang పట్టుబడింది. డిజిటల్ పేమెంట్స్, క్రెడిట్ కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని బాచుపల్లి (Bachupalli) పోలీసులు అరెస్టు చేశారు.
Cyber Crime : సైలెంట్ కాలనీలో అడ్డా..
తొమ్మిది మంది ఉన్న సైబర్ ముఠా బాచుపల్లిలో ఓ విల్లా అద్దెకు తీసుకొని, నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సదరు విల్లాలో నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. భారత్‌తోపాటు యూఎస్‌లోని అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
పక్కా సమాచారం మేరకు పోలీసులు విల్లాపై దాడి చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు(cell phones), లాప్ టాప్స్(laptops) ను స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరాల cyber crimes విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు POLICE సూచిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ (digital payments), క్రెడిట్ కార్డ్స్ (credit cards) పేరుతో ఫోన్ కాల్స్ Phone calls వస్తే.. గుడ్డిగా నమ్మి మోసపోవద్దంటున్నారు. ఫేక్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బ్యాంకు పేరుతో కాల్స్ వస్తే.. ఎట్టి పరిస్థితితోనూ ఓటీపీలు OTP చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు.