అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Attack | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్–పాక్ మధ్య ఉద్రికత్తలు తీవ్రస్థాయికి చేరాయి. రెండు దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.
భారత్ పాకిస్తాన్‌పై నేరుగా యుద్ధం చేయకున్నా.. ఇప్పటికే ఆర్థికంగా ఆ దేశాన్ని దెబ్బతీయడానికి పలు చర్యలు చేపట్టింది. మరోవైపు భారత్ యుద్ధ సన్నాహాలు కూడా చేస్తోంది. ప్రధాని మోదీ PM Modi రక్షణ శాఖ, హోం శాఖ అధికారులతో పాటు, త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించారు. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. దీంతో పాక్ లోలోపల భయపడుతూ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
Cyber Attack | దొడ్డిదారిలో దాడి
భారత్ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ నేరుగా ఏమి చేయలేక మళ్లీ దొడ్డిదారులను ఆశ్రయిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ హ్యాకర్లు hackers దేశ రక్షణశాఖ Defense వైబ్సైట్లపై దాడి చేశారు. ఇటీవల తరుచు సైబర్ అటాక్ cyber attack చేస్తుండగా భారత హ్యాకర్లు తిప్పికొడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ pakistan cyber force అనే హ్యాకర్స్ టీమ్.. భారత రక్షణ సంస్థల్లోకి చొరబడినట్లు వెల్లడించింది. సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసినట్లు తెలిపింది. ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇనిసిస్ట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్, ఇతర వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసినట్లు ఆ గ్రూప్ పేర్కొంది. అయితే, ఇది నిజమా, కాదా అన్న దానిపై ఆయా సంస్థల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Cyber Attack | దర్యాప్తు ప్రారంభం
భారత సంస్థలను హ్యాక్ చేసినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. భారత రక్షణ సిబ్బందికి సంబంధించిన లాగిన్ ఆధారాలతో సహా వర్గీకృత సిబ్బంది డేటాను యాక్సెస్ చేసినట్లు తెలిపింది. ఈ ఉదంతంపై మన సైబర్ భద్రతా సంస్థలు అత్యవసర దర్యాప్తు ప్రారంభించాయి. ఈ డేటా ఉల్లంఘనతో పాటు MoD కింద ఉన్న PSU కంపెనీ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ఈ గ్రూప్ ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. పాకిస్తాన్ జెండా, అల్ ఖలీద్ ట్యాంక్‌ను ఉపయోగించి వెబ్‌సైట్‌ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
