- Advertisement -
HomeజాతీయంCWC Meeting | పాట్నాలో కొనసాగుతున్న సీడబ్ల్యూసీ సమావేశం

CWC Meeting | పాట్నాలో కొనసాగుతున్న సీడబ్ల్యూసీ సమావేశం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CWC Meeting | కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం బీహార్​ రాజధాని పాట్నాలో జరుగుతోంది.పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కాంగ్రెస్​ జెండా ఆవిష్కరించి సమావేశాలు ప్రారంభించారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ సహా కీలక నేతలు పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

CWC Meeting | పాట్నాలో మొదటిసారి..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం(CWC Meeting) నిర్వహిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో అక్టోబర్​ లేదా నవంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని కాంగ్రెస్​, ఆర్జేడీ కూటమి యోచిస్తోంది. ఈ క్రమంలో సమావేశాన్ని బీహార్​లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాహుల్​ గాంధీ రాష్ట్రంలో ఓటర్​ అధికార్​ యాత్ర నిర్వహించారు. బీహార్‌లోని 25 జిల్లాల్లో 15 రోజుల పాటు యాత్ర చేపట్టి కార్యకర్తల్లో జోష్​ నింపారు. ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించడం కోసం సీడబ్ల్యూసీ మీటింగ్​ను సైతం అక్కడే నిర్వహిస్తున్నారు. సమావేశంలో ఓటు చోరీ, బీహార్​ ఎన్నికలపై తీర్మానాలు చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News