అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPO Gains | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market)లో బుధవారం నాలుగు కంపెనీలు లిస్టయ్యాయి. మెయిన్‌బోర్డ్‌కు చెందిన రెండు కంపెనీలు నిరాశ పరిచినా.. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన రెండు కంపెనీలు మాత్రం లాభాలను అందించాయి. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన కరెంట్ ఇన్‌ఫ్రా (Current infrastructure) కంపెనీ మాత్రం పెట్టుబడిని తొలిరోజే డబుల్ చేసింది.
IPO Gains | 90 శాతం ప్రీమియంతో గ్రాండ్ ఎంట్రీ..
ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన కరెంట్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ షేర్లు బుధవారం ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఈ కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్‌ను నుంచి రూ. 41.80 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 80 కాగా.. 90 శాతం ప్రీమియంతో రూ.152 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. రెండు లాట్‌లలో 3,200 షేర్లున్నాయి. అంటే ఐపీవో అలాట్ (IPO Allot) అయినవారికి లిస్టింగ్ సమయంలోనే రూ. 2,30,400 లాభం వచ్చిందన్నమాట.
IPO Gains | సత్వ ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్స్
ఎస్‌ఎంఈ (SME) సెగ్మెంట్‌కు చెందిన సత్వ ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ షేర్లు సైతం ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద ఒక్కో ఈక్విటీ షేరును రూ. 75కి ఆఫర్ చేయగా.. 26.8 శాతం ప్రీమియంతో రూ. 95.10 వద్ద లిస్టయ్యాయి. రెండు లాట్‌లలో కలిపి 3,200 షేర్లున్నాయి. అంటే లిస్టింగ్ సమయంలో ఐపీవో అలాట్ అయినవారికి రూ. 64 వేలు లాభం వచ్చింది.
IPO Gains | నిరాశ పరిచిన మెయిన్‌బోర్డు ఐపీవోలు
మెయిన్‌బోర్డ్‌కు చెందిన విక్రాన్ ఇంజినీరింగ్ (Vikran Engineering) కంపెనీతోపాటు అన్‌లాన్ హెల్త్‌కేర్ కంపెనీలు బుధవారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టయ్యాయి. విక్రాన్ ఇంజినీరింగ్ 2 శాతం, అన్‌లాన్ హెల్త్‌కేర్ ఒక శాతం మాత్రమే ప్రారంభ లాభాలను అందించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి విక్రాన్ 1.33 శాతం నష్టాన్ని మిగల‍్చగా.. అన్‌లాన్ మాత్రం 3.4 శాతం లాభంతో ఉంది.