అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఇంట్లోకి కోతులు వస్తున్నాయని వాటిని నిలువరించేందుకు ఓ వ్యక్తి కరెంట్ వైర్లు బిగించగా.. అమర్చిన విద్యుత్ తీగలతో ఆ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ విషాదకర ఘటన ఎల్లారెడ్డి మండలంలో చోటు చేసుకుంది.
ఎల్లారెడ్డి ఎస్సై మహేష్(SI Mahesh) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన బండారి దుర్గయ్య(42) ఇంట్లో ఓవైపు కూలిపోయి ఓ రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ రంధ్రానికి జేవైర్ను చుట్టాడు. అయినప్పటికీ కోతులు ఇంట్లోకి వస్తున్నాయి.
కోతులు రాకుండా ఆ జేవైర్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో సోమవారం జేవైర్ను సరిచేస్తుండగా.. కరెంట్‌షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కిష్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.