అక్షరటుడే, వెబ్‌డెస్క్: Curdled milk | విరిగి పోయిన పాలను సింక్‌లో పారబోయడం చాలా మందికి సులభమైన పనిగా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న అలవాటు ఇంటి ప్లంబింగ్ వ్యవస్థకు, పర్యావరణానికి తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు.
పాలలో ఉండే కొవ్వులు, ప్రోటీన్లు పైపుల్లో గడ్డకట్టి, డ్రైనేజీ అడ్డంకులకు, దుర్వాసనలకు కారణమవుతాయట.
అంతేకాక, మురుగు నీటి వ్యవస్థ ద్వారా నీటి వనరులలోకి చేరితే, అది నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి, జలచరాలకు హాని కలిగిస్తుందంటున్నారు. కాబట్టి, పాలను సురక్షితంగా, పర్యావరణానికి environmentally హాని కలగకుండా ఏమి చేయాలనే దానికి.. సరళమైన పద్ధతులను తెలుసుకుందాం.
Curdled milk | దుష్ప్రభావాలు..
ప్లంబింగ్ plumbing ఎందుకు దెబ్బ తింటుందంటే..
కొవ్వులు, అడ్డంకులు: పాలల్లో ఉండే కొవ్వులు (Fats) , ప్రోటీన్లు proteins పైపుల లోపలి గోడలకు అతుక్కుపోతాయి. ముఖ్యంగా చల్లటి పైపులలో ఈ కొవ్వులు ఘనీభవించి, నెమ్మదిగా డ్రైనేజీ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి.
దీనివల్ల మురుగు కాలువలు జామ్ అవ్వడం, దుర్వాసన రావడం, చివరకు ఖరీదైన ప్లంబింగ్ రిపేర్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
పర్యావరణానికి హానికరం ఎలా అంటే..
ఆక్సిజన్ క్షీణత: పాలు మురుగునీటి శుద్ధి వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు, అందులోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి బ్యాక్టీరియా అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను వినియోగిస్తుంది.
దీనివల్ల నదులు, వాగులలో ఆక్సిజన్ Oxygen స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా చేపలు, ఇతర జలచరాలకు తీవ్ర హాని కలుగుతుంది.
దుర్వాసన, ఆల్గే: పాలు కుళ్ళిపోవడం వల్ల దుర్గంధ భరితమైన వాసనలు వస్తాయి. హానికరమైన ఆల్గే (నాచు) పెరుగుదలకు దోహదం చేస్తాయి.
Curdled milk | సరళమైన ప్రత్యామ్నాయాలు..
కంపోస్ట్ చేయడం: తక్కువ మొత్తంలో పాలను ఇతర కంపోస్ట్ (సేంద్రియ ఎరువు) పదార్థాలతో కలిపి మొక్కలకు వేయవచ్చు. ఇది నేలను సారవంతంగా చేస్తుంది.
మొక్కలకు ఎరువుగా: పాలను నీటితో బాగా కరిగించి (ఉదాహరణకు 1 భాగం పాలు: 4 భాగాలు నీరు), మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు.
వ్యర్థాలలో పారవేయడం: పాలను ఒక మూసి వున్న కంటైనర్ (లేదా పాత ప్లాస్టిక్ సీసా) లో పోసి, ఆ కంటైనర్‌ను సాధారణ గృహ వ్యర్థాలలో (చెత్త) వేయడం సురక్షితమైన మార్గం.
చిన్న మార్పు, పెద్ద ప్రయోజనం..
సింక్‌లో పాలు పోయడం మానేసి, ఈ సులభమైన ప్రత్యామ్నాయాలను అనుసరించడం ద్వారా ఇంటి ప్లంబింగ్ నిర్వహణను మెరుగుపరచడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో భాగమవుతారు.