అక్షరటుడే ఇందూరు: Kendriya Vidyalaya | విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ అన్నారు. బోయిన్పల్లి క్లస్టర్ స్థాయి కేంద్రీయ విద్యాలయాల ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’లో (Ek Bharat shreshtha bharat) భాగంగా ఆయా అంశాల్లో పోటీలు నిర్వహించారు.
Kendriya Vidyalaya | పలు అంశాల్లో శిక్షణ..
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ ఆయన మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతో పాటు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు.
పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటి.. ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం (Nizamabad Kendriya vidyalaya) ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, సంగీత పాఠశాల ప్రిన్సిపాల్ రవీంద్ర రాజు, అధ్యాపకులు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు.
గీతాలాపన చేస్తున్న విద్యార్థులు