- Advertisement -
Homeక్రీడలుIPL 2025 | సీఎస్‌కే ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్! : వీడియో

IPL 2025 | సీఎస్‌కే ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్! : వీడియో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:IPL 2025 | సౌతిండియా స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) కన్నీటి పర్యంతమైంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వరుస పరాజయాలను తట్టుకోలేక బోరున విలపించింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సీఎస్‌కే(CSK) 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌కు హాజరైన శృతి హాసన్.. చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)కు అండగా సందడి చేసింది. సీఎస్‌కే ఆటగాళ్లు బౌండరీలు బాదినప్పుడు.. వికెట్లు తీసినప్పుడు ఎగిరి గంతేసింది. చివరకు ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే(CSK) ఓటమిపాలవ్వడంతో.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. కన్నీటిని తన చేతి వేళ్లతో తుడుచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో(Video) నెట్టింట వైరల్‌గా మారింది.

- Advertisement -

ఈ మ్యాచ్‌కు శృతి హాసన్‌తో పాటు తమిళ స్టార్ హీరోలు అజిత్, శివ కార్తీకేయన్‌లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే చెన్నై(Chennai) ఓడిపోవడంతో వీరంతా నిరాశగా మైదానాన్ని వీడారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసి గెలుపొందింది.

ఈ ఓటమితో సీఎస్‌కే(CSK) ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చివరి 5 మ్యాచ్‌లకు ఐదు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితిని తెచ్చుకుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News