అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: Heavy Rains | జిల్లావ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం (Heavy Rains) దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలు పూర్తిగా జలమయమమయ్యాయి. బస్టాండ్, రైల్వేస్టేషన్(Railway Station) ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. రైల్వేస్టేషన్ ప్రాంతంలో డ్రెయినేజీ నీళ్లు(Drainage water) రోడ్డు పైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Heavy Rains | అయోమయంలో అన్నదాత..
అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా అన్నదాతలు ఆయోమయానికి గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టి టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యంలోకి నీళ్లు చేరాయి. అలాగే రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయింది. దీంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసుకున్నారు.

