అక్షరటుడే, వెబ్‌డెస్క్: CRPF jawan marries Pakistani girl : గతేడాది పాకిస్తాన్ యువతిని మన CRPF(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్ వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చింది. దీంతో జవాన్ సెలవుపై ఇంటికి తన ఇంట్లో ఆమెతో కాపురం పెట్టాడు.
కాగా, పహల్గావ్ ఉగ్రదాడి Pahalgaon terror attack తర్వాత భారత్ లోని పాకిస్తానీయులు వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. సరైన పత్రాలు లేకుండా ఇక్కడ ఉన్న పాకిస్తానీయులను వెతికి మరీ పాక్‌కు పంపించేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అలా సెర్చింగ్ క్రమంలో పాక్ అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసి.. CRPF అధికారులు సదరు జవాన్‌ను విధుల నుంచి తప్పించారు.
CRPF అధికారుల వివరణ ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లో CRPF జవాన్‌గా పనిచేస్తున్న మునీర్ అహ్మద్, మేనాల్ ఖాన్ అనే పాకిస్తాన్ యువతిని గతేడాది మే 24న వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నారు. అక్టోబరులో పెళ్లి గురించి CRPF అధికారులకు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాఘా – అట్టారి సరిహద్దు ద్వారా మేనాల్ ఖాన్ భారత్‌కు వచ్చింది. ఆమె 15 రోజుల గడువు ఉన్న వీసా మార్చిలోనే ముగిసింది. దీంతో దీర్ఘకాలిక వీసా కోసం మునీర్ దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఏప్రిల్‌లో పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మేనాల్ ఖాన్ వీసా గడుపు ముగిసిన విషయం వెలుగుచూసింది. అయితే, జమ్మూకశ్మీర్ హైకోర్టు సదరు యువతిని వెనక్కి పంపకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మునీర్ అహ్మద్ చర్యలు జాతీయ భద్రతకు హానికరమని భావించి, అతడిని తొలగించినట్లు CRPF అధికారులు వివరణ ఇచ్చారు.
పాకిస్తాన్ జాతీయురాలితో పెళ్లి విషయం దాచిపెట్టి, ఆమె వీసా చెల్లుబాటుకు మించి తెలిసి ఆశ్రయం కల్పించినందుకు మునీర్ అహ్మద్ ను తక్షణమే సర్వీసు నుంచి తొలగించాం అని సీఆర్‌పీఎఫ్ ప్రతినిధి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎం దినకరన్ తెలిపారు.
కాగా, మునీర్ మాత్రం తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. తన పెళ్లి, వీసా గడువు ముగింపు గురించి సమాచారం ఇచ్చానని అంటున్నారు. సెలవు తర్వాత తాను మార్చి 23న తిరిగి విధుల్లో చేరినట్లు చెబుతున్నారు. కానీ, అకస్మాత్తుగా తనను (భోపాల్‌కు) బదిలీ చేశారంటున్నారు. అయినా తాను వెళ్లి 41 బెటాలియన్‌లో చేరినట్లు పేర్కొంటున్నారు. తనకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా లకు మునీర్ విజ్ఞప్తి చేస్తున్నారు.
