అక్షరటుడే ఇందూరు/కామారెడ్డి: Bathukamma Sambaram | బతుకమ్మ సంబరాలకు ఉమ్మడిజిల్లా సిద్ధమైంది. ఈ సందర్భంగా కామారెడ్డి (Kamareddy), నిజామాబాద్ (Nizamabad) జిల్లాల్లోని పూల మార్కెట్లు సందడిగా మారాయి. కామారెడ్డి డెయిలీ మార్కెట్ ఆదివారం పూల క్రయ విక్రయదారులతో సందడి నెలకొంది.
Bathukamma Sambaram | సద్దుల బతుకమ్మ..
సద్దుల బతుకమ్మ సంబరాన్ని సోమవారం నిర్వహించనుండడంతో గునుగు, తంగెడు, బంతి పూలు కొనుగోలు చేస్తున్నారు. పూల ధరలు కూడా అమాంతం పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. గునుగు పువ్వు ధర ఆకాశాన్నంటింది. బంతిపూలు మామూలు రోజుల్లో కిలో ధర రూ.80 నుంచి 100 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 వరకు ఉంది. అయినా తంగెడు పువ్వు ఎక్కువగా దొరకకపోవడంతో బంతి పూలు కొనుగోలు చేస్తున్నారు.
మరోవైపు చామంతి పూలు, పత్తిగొండ పూలు మార్కెట్లో దర్శనం ఇవ్వడంతో కొనుగోలు చేస్తున్నారు. పండుగ సందర్భంగా పూల గిరాకీతో మార్కెట్ సందడిగా మారింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ జనాలతో రద్దీగా మారాయి.
Bathukamma Sambaram | నిజామాబాద్ నగరంలోని డెయిలీ మార్కెట్లో..
నగరంలోని అంగడిబజార్, రైల్వేకమాన్ వద్ద పూలమార్కెట్ సందడిగా కనిపించింది. అలాగే రైల్వేస్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పూలవిక్రయాలు జరిగాయి. బంతిపూలు రూ.120వరకు విక్రయించారు. బతుకమ్మను పేర్చేందుకు గునుగ పువ్వు, చామంతి, గులాబీ పువ్వులను మహిళలు కొనుగోలు చేశారు.