అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పట్టింది. అయితే సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా ఆదివారం శ్రీవారిని 82 వేల మంది దర్శించుకున్నారు.