అక్షరటుడే, న్యూఢిల్లీ: | పాక్ రేంజర్‌ను BSF పట్టుకుంది. శనివారం(మే 3) రాజస్థాన్‌లోని ఫోర్ట్ అబ్బాస్ వద్ద మన దేశంలోకి అడుగుపెట్టిన పొరుగు దేశానికి చెందిన సైనికుడిని భారత సరిహద్దు గార్డులు అదుపులోకి తీసుకున్నారు.
పహల్గావ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత india pak war కొనసాగుతోంది. ఈ తరుణంలో తెలిసి కూడా పాకిస్తాన్ రేంజర్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా భారత సరిహద్దు indian border గార్డులు, పోలీసులను దుర్భాషలాడాడు. దీంతో వెంటనే అతడిని భారత సైనికులు అదుపులోకి తీసుకున్నారు.
భారత భద్రతా దళాలకు పాక్ సైనికుడు పట్టుబడగానే పాకిస్తాన్‌లో అలజడి చెలరేగింది. రేంజర్‌ను విడిపించుకోవడానికి సరిహద్దు గార్డుల ఫ్లాగ్ మీటింగ్ నిర్వహిస్తామంటూ పట్టుబడుతోంది.
ఏడు రోజుల క్రితం బెంగాలీ సైనికుడు పూర్ణమ్ సాహును poornam sahoo పాకిస్తాన్ ఇదే విధంగా అరెస్టు చేసింది. పహల్గావ్ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పొరుగు దేశం సరిహద్దులోకి ప్రవేశించినందుకు పూర్ణమ్‌ను పాక్ సైన్యం అరెస్టు చేసింది. ఫ్లాగ్ మీటింగ్ జరిగినప్పటికీ, ఇంకా అతడిని పాకిస్తాన్ విడుదల చేయలేదు.