ePaper
More
    HomeజాతీయంVice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ రాధకృష్ణన్ CP Radhakrishnan ఘన విజయం సాధించారు.

    విపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) పై 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఊహించిన దాని కంటే ఎక్కువ మెజార్టీ రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    సుదర్శన్ రెడ్డికి విపక్షాల సంఖ్యాబలం కంటే తక్కువ ఓట్లు రావడంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేలిపోయింది.

    మంగళవారం (సెప్టెంబరు 9) జరిగిన ఎన్నికల్లో మొత్తం 767 ఓట్లు పోల్ కాగా, 15 చెల్లకుండా పోయాయి. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా, ఆయన ప్రత్యర్థికి 300 ఓట్లు వచ్చాయి.

    Vice Presidential election : పెరిగిన మెజార్టీ

    రాధాకృష్ణన్ గెలుపుపై ఆది నుంచి సందేహం లేకపోయినప్పటికీ, మెజార్టీ మీదే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

    బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు లోక్​సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) లో 427 మంది సభ్యుల బలం ఉంది. కనీస మెజార్టీ 377 కంటే స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు సులువేనని అంతా భావించారు.

    ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది సభ్యులు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో రాధాకృష్ణన్​కు 438 ఓట్లు రావాలి. కానీ అంతకంటే ఎక్కువ రావడం ఇప్పుడు విపక్షాలను ఆశ్చర్యానికి, అసహనానికి గురి చేసింది.

    Vice Presidential election : క్రాస్-ఓటింగ్..

    ఎన్డీయే అభ్యర్థిగా అదనంగా 14 ఓట్లు రావడంతో విపక్షాలు సందిగ్ధంలో పడిపోయాయి. తమ ఎంపీలు కొందరు క్రాస్-ఓటింగ్ చేసేనట్లు అనుమానిస్తున్నాయి.

    వాస్తవానికి ప్రతిపక్షాల బలాన్ని బట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు రావాలి. అలాగే, ఆప్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అదనంగా మరో 12 ఓట్లు కలిపితే 332 ఓట్లు పడాల్సి ఉంది.

    కానీ, 300 ఓట్లే పడ్డాయి. చెల్లని ఓట్లను తీసేసినా కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం తేలిపోతుంది. ఆప్ 12 ఓట్లు పక్కన పెడితో ఇండి కూటమి పక్షాలకు చెందిన 15 ఓట్లు ఎటువెళ్లాలయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. కొంత మంది విపక్ష ఎంపీలు కావాలనే బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారని అర్థమవుతోంది.

    బయటపడిన విభేదాలు..

    ఇండి కూటమిలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని తాజా ఎన్నికతో మరోసారి తేలిపోయింది. రానున్న బీహార్ ఎలక్షన్ల ముందర తాజా పరిణామం ఇండి కూటమికి ఎదురుదెబ్బ అనే భావన నెలకొంది.

    యాంటీ బీజేపీ వర్గాలను ఏకం చేయాలన్న ఏకైక లక్ష్యంతో 2023లో ఏర్పడిన ఇండి కూటమిలో తొలి నుంచి ఐక్యత కరవైంది.

    మధ్యప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమిలో వర్గ పోరు బయట పడింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆ విభేదాలే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తక్కువ ఓట్లు రావడానికి కారణమై ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....