HomeUncategorizedCrocodile | నడిరోడ్డుపై మొసలి ప్రత్యక్షం.. చకచకా వాకింగ్​.. వీడియో వైరల్​..!

Crocodile | నడిరోడ్డుపై మొసలి ప్రత్యక్షం.. చకచకా వాకింగ్​.. వీడియో వైరల్​..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Crocodile : వడోదరలోని విశ్వామిత్ర Vishwamitra బ్రిడ్జి రోడ్డు అది.. వాహనాల రద్దీతో నిత్యం బిజీగా ఉంటుంది. అలాంటి రహదారిపై అనుకోని అతిథి ప్రత్యక్షమైంది. ఠీవీగా నడుచుకుంటూ వెళ్తోంది. ఉదయం పనులకు వెళ్లి, హడావుడి ఇంటికి పరుగులు పెడుతున్న వాహనదారులు హఠాత్తుగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

గురువారం రాత్రి విశ్వామిత్ర వంతెన Bridge దారిలో ఎనిమిది అడుగుల పొడవున్న మొసలి హల్​చల్​ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, హఠాత్తుగా దర్శనం ఇవ్వడంతో వడోదర నివాసితులు షాక్ అయ్యారు. దానిని చూసేందుకు భారీగా జనాలు అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్​ను నిలిపివేశారు. ఇదే తరుణంలో చాలా మంది అప్పటికే తమ సెల్​ఫోన్​లో బంధించి నెట్టింట వైరల్​ చేశారు.

Crocodile : మొసళ్లకు ప్రసిద్ధి..

సదరు వీడియోలలో.. రోడ్డు మధ్యలో మొసలి ఆగి కనిపించింది. అనంతరం అకస్మాత్తుగా జనం వైపు దూసుకుపోయింది. అరుస్తూ, వేగంగా దూసుకుపోతూ భయపెట్టడానికి ప్రయత్నించింది. విశ్వామిత్ర నదికి దూరంగా.. నరహరి ఆస్పత్రికి దగ్గరలోని కమిషనర్ భవనం సమీపంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.

విశ్వామిత్ర నది Vishwamitra River నుంచి ఈ మొసలి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. అధికారులు అక్కడికి చేరుకుని, ఆ సరీసృపాన్ని తిరిగి నదిలో వదిలేశారు.

వడోదర Vadodara మీదుగా విశ్వామిత్ర నది ప్రవహిస్తుంది. ఈ నది మొసళ్లకు ప్రసిద్ధి. దాదాపు 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 300 వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్షాకాలంలో నది నీటి మట్టం పెరగడం వల్ల ఈ మొసళ్లు ఇలా బయటకు వస్తున్నట్లు పేర్కొంటున్నారు.