Chinese manja | చైనామాంజాతో హాని జరిగితే బాధ్యులపై క్రిమినల్​ కేసులు: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chinese manja | చైనా మాంజాతో ఎవరికైనా హాని కలిగితే బాధ్యులపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. Chinese manja | మనుషులు, పక్షులకు ప్రమాదం.. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ (District Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలకు సీపీ సాయిచైతన్య ఈ సందర్భంగా సూచనలు చేశారు. చైనామాంజా […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chinese manja | చైనా మాంజాతో ఎవరికైనా హాని కలిగితే బాధ్యులపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

Chinese manja | మనుషులు, పక్షులకు ప్రమాదం..

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ (District Police Commissionerate) పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలకు సీపీ సాయిచైతన్య ఈ సందర్భంగా సూచనలు చేశారు. చైనామాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులు, పశువులకు ప్రమాదం జరుగుతుందన్నారు. ఈ చైనామాంజా కారణంగా ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే సంబంధిత చైనామాంజా (Chinese manja) వినియోగించిన, విక్రయించిన వారిపై క్రిమినలు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి

కొంతమంది ఇప్పటికే హైదరాబాద్​ (Hyderabad) నుంచి నిజామాబాద్​కు చైనామాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉందని సీపీ తెలిపారు. ముందుగానే సదరు వ్యక్తులు వెంటనే తమవద్ద ఉన్న చైనామాంజాను స్థానిక పోలీస్​స్టేషన్​లో అప్పగించాలని సూచించారు. లేదా కాల్చివేయాలన్నారు. చైనామాంజా నిల్వ ఉంచినా.. విక్రయిస్తున్నా.. వారి వివరాలు పోలీసులకు అందజేయాలని కోరారు. వివరాలిచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

Related articles

Ramchander Rao Arrest | బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramchander Rao Arrest | బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావును పోలీసులు అరెస్ట్​ చేశారు. కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ...

Gurugram live-in attack | పెళ్లి చేసుకోమ‌న్నందుకు దారుణం.. యువతిపై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gurugram live-in attack | హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై...

Telangana Rain Alert | ఉరుములతో కూడిన వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Alert | నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States)...

Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన దేవ్​జీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేతలు దేవ్​జీ,...