Homeజిల్లాలుకామారెడ్డిSp Rajesh Chandra | బీట్ పద్ధతిని సక్రమంగా నిర్వర్తిస్తూ నేరాలను అరికట్టాలి

Sp Rajesh Chandra | బీట్ పద్ధతిని సక్రమంగా నిర్వర్తిస్తూ నేరాలను అరికట్టాలి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | రాత్రి సమయాల్లో బీట్ పద్ధతిని సక్రమంగా నిర్వర్తిస్తూ నేరాలను అరికట్టాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్​ను గురువారం ఆయన (machareddy Police station) తనిఖీ చేశారు. పోలీస్​ స్టేషన్ పరిసర ప్రాంతాలు, సిబ్బంది బ్యారక్ పరిశీలించి శుభ్రత పాటించాలని సూచించారు. మొదట రోల్ కాల్‌ను పరిశీలించి, హాజరైన, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.

మానవ వనరుల పూర్తిస్థాయి వినియోగం, రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది సిబ్బందిలో నిబద్ధతను, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క పోలీసుకు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి పోలీసుకు శుభ్రమైన యూనిఫామ్, నీట్ షేవింగ్ అందాన్ని తీసుకొస్తాయని, వాటిని కచ్చితంగా పాటించాలని సూచించారు.

Sp Rajesh Chandra | దర్యాప్తులో కానిస్టేబుళ్ల పాత్ర కీలకం..

దర్యాప్తు ప్రక్రియలో కానిస్టేబుళ్ల (Constables) పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి కేసును నిజాయితీతో, నైపుణ్యంతో, సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన పోలీసింగ్ సాధ్యమవుతుందని తెలిపారు.

బ్లూ కోల్డ్స్ (Blue Colds), పెట్రో కార్ సిబ్బంది (Petro car staff) విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విజిబుల్ పోలీసింగ్​పై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ చైతన్య రెడ్డి, రూరల్ సీఐ రామన్, ఎస్సై అనిల్, సిబ్బంది ఉన్నారు.

Sp Rajesh Chandra | పదోన్నతి పొందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్​కు అభినందన

ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సాయిలు ఇటీవల పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆయనను అభినందించి పదోన్నతి చిహ్నాలను స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతులు ఉద్యోగ బాధ్యతను పెంచడమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. ప్రజలకు నిజాయితీగా, నిబద్ధతతో సేవలందించే పోలీస్ సిబ్బందికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు.