అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లాలో ఈ ఏడాది నేరాలను అదుపు చేశామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వార్షిక ప్రణాళికను వెల్లడించారు.
CP Sai Chaitanya | నాలుగు శాతం తగ్గిన క్రైం రేట్..
ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో క్రైం రేటు నాలుగు శాతం తగ్గిందని సీపీ వెల్లడించారు. మహిళలలపై అఘాయిత్యాలు, ఫోక్సో కేసులు (POCSO cases) స్వల్పంగా పెరిగాయన్నారు. జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామని సీపీ వెల్లడించారు. డ్రంకన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కఠినంగా వ్యవహరించామని తెలియజేశారు.
పెరిగిన సైబర్ క్రైంలు..
జిల్లాలో సైబర్ క్రైంలు పెరిగాయని సీపీ తెలిపారు. సైబర్ నేరాల విషయంలో గతేడాదితో పోలిస్తే 30శాతం పెరుగుదల ఉందన్నారు. డిజిటల్ మోసాలు సైబర్ నేరగాళ్ల విషయంలో మోసపోకుండా ఉండేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై (digital platforms) ప్రజలు మోసపోతున్నారని ఆయన తెలిపారు.
బాధితులకు అండగా ఉన్నాం..
సైబర్ క్రైం నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులపై వెనువెంటనే స్పందిస్తూ డబ్బులను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది రికవరీ రేటు పెరిగిందని పేర్కొన్నారు. పోలీసులు అంకిత భావంతో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్‌ను పరిరక్షించేందుకు కృషిచేస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను ఆదేశిస్తూ తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నూతన సంవత్సర వేడుకలు నిబంధనల మేరకు జరుపుకోవాలని సీపీ సూచించారు. యువత హద్దు మీరితే కఠినచర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.