అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: RP Super Speciality Hospital | నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ (Dr. Boddula Rajendra Prasad) విలేకరుల సమావేశం నిర్వహించారు.
RP Super Speciality Hospital | డిచ్‌పల్లి సీఎంసీ మైదానంలో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీ నుంచి 11వరకు డిచ్‌పల్లిలో క్రికెట్ టోర్నమెంట్ (cricket tournament) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ డిచ్‌పల్లి సీఎంసీ మైదానంలో జరుగుతుందన్నారు. డిచ్‌పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్శిటీ, ఏడో పోలీస్ బెటాలియన్లకు చెందిన 16 జట్లు ఇందులో పాల్గొంటున్నాయన్నారు.
RP Super Speciality Hospital | యువత మత్తు పదార్థాలకు వైపు మళ్లకుండా..
యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరించారు. క్రికెట్ పోటీల్లో విజేతలకు 11వ తేదీన జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. మీడియా సమావేశంలో ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు బి.వినోద్, ఎం.బాబు, బి.వనిత, జె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.